మరో నటుడిని టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ (Bishnoi gang) గురించి తెలియని వారుండరు. ఈ గ్యాంగ్ గత కొన్ని ఏళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) వెనక పడింది. ఆ హీరోను చంపేస్తామంటూ తరచూ బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పలుమార్లు ఆయనపై హత్యాయత్నానికి విఫలయత్నం కూడా చేసింది. అయితే ఆయన సన్నిహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని ఈ గ్యాంగే హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరో నటుడు బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు.

మరో నటుడికి బెదిరింపులు

బాలీవుడ్ నటుడు అభినవ్ శుక్లాకు తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభినవ్ శుక్లా తెలిపాడు. ఈ సందర్భంగా అనుమానితుడి వివరాలు కూడా షేర్ చేస్తూ తన పోస్టుకు పంజాబ్, చండీగఢ్ పోలీసులను ట్యాగ్ చేశాడు. శుక్లా సోషల్ మీడియా ఖాతాకు ఓ వ్యక్తి తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడను అని.. తనకు శుక్లా ఇంటి చిరునామా తెలుసని.. ఓ సందేశం వచ్చింది. ఇటీవల సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే మీ ఇంటిపై కూడా జరుపుతామని ఆ సందేశంలో సదరు సభ్యుడు బెదిరించాడని శుక్లా తెలిపాడు.

Image

జాగ్రత్తగా ఉండండి..

అసిమ్‌ (బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆసిమ్ రియాజ్) గురించి గౌరవంగా మాట్లాడండి. లేదంటే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ లిస్ట్‌లో మీ పేరు చేరుతుంది. ఇదే మీకు చివరి హెచ్చరిక. మళ్లీ ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మీ ఇంటిపై కాల్పులు జరుపుతాం. తెలుసుగా సల్మాన్ ఖాన్ ఇంటిపై మేం కాల్పులు జరిపిన విషయం. అలాగే మీ ఇంటిపైనా దాడి చేస్తాం’’ అని సదరు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అభినవ్ శుక్లాను బెదిరించాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు, భద్రతా సిబ్బందికి కూడా బెదిరింపులు వచ్చాయని అభినవ్‌ (Abhinav Shukla) ఈ పోస్డు ద్వారా తెలిపాడు. అతడినుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించాడు.

రుబీనా వర్సెస్ ఆసిమ్

ఇయుత్ ఇటీవల అభినవ్‌ శుక్లా భార్య రుబీనాకు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అసిమ్‌ రియాజ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఈ మధ్య బాగా చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ ఇటీవల మరింత ముదిరింది. దీంతో తన భార్యకు మద్దతుగా నిలుస్తూ అభినవ్ శుక్లా అసిమ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అసిమ్‌ అభిమానులు ఈ నటుడికి బెదిరింపు సందేశాలు పంపుతున్నారు. తాజాగా వచ్చిన సందేశం కూడా అతడి అభిమానులే పంపినట్లు అభినవ్‌ ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *