రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘కల్కి’ సినిమాతో తన కెరీర్ లోనే మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్ (The Raja Saab)’ షూటింగ్ జరుగుతోంది. ఇక హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఓ సినిమా చేస్తుండగా.. దానికి ‘ఫౌజీ’ (Fauji) అనే టైటిల్ అనుకుంటున్నట్లు నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ అప్డేట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..?
ఫౌజీలో బాలీవుడ్ నటుడు
ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు నటించబోతున్నాడట. ఆయన ఎవరో కాదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనుపమ్ ఖేర్ (Anupam Kher). ఆయన తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. నిఖిల్ నటించిన ‘కార్తికేయ-2’తో అనుపమ్ ఖేర్ మొదటిసారిగా టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించారు. ఆ సినిమాలో అనుపమ్ ఖేర్.. కృష్ణభగవానుడి గురించి ఎలివేషన్స్ ఇచ్చే సీన్ ఆ చిత్రానికే హైలైట్ గా నిలిచింది. రవితేజ నటించిన `టైగర్ నాగేశ్వరరావు`లోనూ అనుపమ్ ఖేర్ సందడి చేశారు.
ప్రభాస్ కోసం సాయి పల్లవి
తాజాగా పాన్ ఇండియా చిత్రం `ఫౌజీ` లోనూ ఆయన నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో అనుపమ్ ఖేర్ ను హను రాఘవపూడి ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) కూడా భాగం కాబోతున్నట్లు నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది. ఆమెను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ (Imanvi) నటిస్తున్న విషయం తెలిసిందే.






