Kangana Ranaut: పెళ్లిపై నాకు పెద్దగా నమ్మకం లేదు.. ప్రస్తుతం నా ఫోకస్ వాటిపైనే!

బాలీవుడ్ నటి(Bollywood actress), బీజేపీ ఎంపీ(BJP MP) కంగనా రనౌత్(Kangana Ranaut) తన పెళ్లి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆప్ కీ అదాలత్(Aap Ki Adalath)’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన వ్యక్తిగత జీవితంపై వెల్లడించిన విషయాలు అభిమానులను ఆకర్షించాయి. 38 ఏళ్ల కంగనా, తన చుట్టూ ఉన్న వివాదాలు, కోర్టు కేసులు పెళ్లి(Marriage)కి అడ్డంకిగా మారాయని చెప్పుకొచ్చారు. “పెళ్లి గురించి నాకు మంచి అభిప్రాయం ఉంది. ప్రతి ఒక్కరికీ భాగస్వామి, పిల్లలు ఉండాలని కోరుకుంటాను. కానీ, నా చుట్టూ ఉన్న ప్రతికూల ప్రచారం, కేసుల వల్ల పెళ్లి చర్చలు ముందుకు సాగడం లేదు” అని ఆమె వెల్లడించారు.

ఆ సంఘటన నాపై తీవ్ర ప్రభావం చూపింది

ఒక ఆశ్చర్యకర సంఘటనను పంచుకుంటూ కంగనా ఇలా అన్నారు. “ఒకసారి మా ఇంట్లో పెళ్లి చర్చల కోసం మగపెళ్లి తరపు వారు వచ్చారు. అదే సమయంలో కోర్టు సమన్లు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి భయపడి పరుగులు తీశాడు. ఈ సంఘటనలు వినడానికి సరదాగా ఉన్నప్పటికీ నా జీవితంలో తీవ్ర ప్రభావాన్ని చూపాయి’ అని కంగనా చెప్పుకొచ్చారు.

సినిమా, పాలిటిక్స్‌పైనే ఫోకస్

అంతేకాదు.. ‘నిజానికి నాకు పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేదు. అందుకే, దానికి దూరంగా ఉంటున్నాను. నాకు పెళ్లి కావట్లేదనే బాధ అస్సలు లేదు. ప్రస్తుతం నేను సినిమా(Movies)లు, పాలిటిక్స్(Politics) మీదనే దృష్టి పెడుతున్నాను. పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించలేదు. బహుషా పెళ్లి, పిల్లలు అనేవి నాకు సూట్ కావు’ అంటూ కంగనా రనౌత్ క్రేజీ కామెంట్స్ చేసింది. కంగనా నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ(Emergency)’ చిత్రం సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *