Sanjay Kapoor: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్(Karisma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్ (Sanjay Kapoor) మరణించారు. 53 ఏళ్ల ఆయన పోలో గేమ్ ఆడుతూ గుండెపోటు(Heart attack while playing polo)తో హఠాన్మరణం చెందారు. సంజయ్ కపూర్ UKలో ఉండగా ఆయన పోలో గేమ్‌లో గుర్రాన్ని నడుపుతున్న సమయంలో తేనెటీగ నోటిలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కొంత ఇబ్బంది పడగా హార్ట్ ఎటాక్(Heart Attack) వచ్చినట్టు సమాచారం. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

2003లో కరిష్మా కపూర్‌తో సంజయ్ వివాహం

కాగా సంజయ్ కపూర్ ఇండియా(India)లో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు. ఆయన కరిష్మా కపూర్‌ని 2003లో సంజయ్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా ఈ జంట 2014లో విడాకులు తీసుకుంది. ఆ తరువాత ప్రియా సచ్ దేవ్‌(Priya Sach Dev)ను సంజయ్ వివాహం చేసుకున్నారు. మరోవైపు కరిష్మా మాత్రం సింగిల్‌గానే ఉంటున్నారు. తాజాగా ఆయన గుండెపోటుతో మరణించడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. సంజ‌య్ మృతి ప‌ట్ల‌ సినీ, వ్యాపార ప్ర‌ముఖులు సంతానం ప్ర‌క‌టించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *