
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Director Anurag Kashyap) సెన్సార్ బోర్డు (Central Board of Film Certification) తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు(censor board) సినిమాల్లో పాత్రల పేర్లు, ముఖ్యంగా పురాణాలతో సంబంధం ఉన్న పేర్లపై అభ్యంతరాలు లేవనెత్తడం(Objections to names)పై కశ్యప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చిత్రంలో ‘జానకి’ అనే పాత్ర పేరును సీతమ్మతో అనుసంధానిస్తూ మార్చాలని సెన్సార్ బోర్డు సూచించడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. “మనం కథలకు నిజమైన పేర్లు పెట్టలేమా? XYZ, 123, ABC వంటి పేర్లు ఉపయోగించాలా?” అని ఆయన సెన్సార్ బోర్డును ప్రశ్నించారు.
తెలుగు సినిమాలపై కూడా ప్రతికూల ప్రభావం
అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ, సెన్సార్ బోర్డులోని అధికారులకు హిందీ భాషపై సరైన అవగాహన లేని విషయాన్ని కూడా ఎత్తి చూపారు. “బోర్డులో చాలా మందికి హిందీ సరిగ్గా అర్థం కాదు. అయినా నిర్ణయాలు తీసుకుంటారు” అని ఆయన విమర్శించారు. ఈ ఆంక్షలు సినిమా సృజనాత్మకతకు సంకెళ్లు వేస్తున్నాయని, తెలుగు సినిమాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలోనూ సెన్సార్ బోర్డుపై విమర్శలు
కాగా కశ్యప్‌తోపాటు బాలీవుడ్ నటి శ్రేయ ధన్వంతరి(Shreya Dhanwantari), టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్(Director Tarun Bhaskar)లతో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా సెన్సార్ బోర్డు నిర్ణయాలపై గతంలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో కశ్యప్ వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. సెన్సార్ బోర్డు నిర్ణయాలు సినిమా నిర్మాణంలో స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయని, కళాత్మక వ్యక్తీకరణను దెబ్బతీస్తున్నాయని కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శలు సినీ పరిశ్రమలో సెన్సార్ బోర్డు పాత్రపై మరోసారి చర్చకు దారితీశాయి.
Anurag Kashyap says he carried a Hindi dictionary during CBFC screening of ‘Satya’ when the word ‘chu***a’ was objected: ‘They don’t know Hindi, it means murkh or stupid’ #AnuragKashyap #CBFC https://t.co/3sRbh6KNzy
— ETimes (@etimes) July 17, 2025