
హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు(City Civil Court) ప్రాంగణంలో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. కోర్టులో బాంబు(Bomb) పెట్టినట్లు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన అధికారులు వెంటనే కోర్టు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. వివరాల్లోకి వెళితే, గుర్తుతెలియని వ్యక్తి కోర్టుకు ఫోన్ చేసి, ఆవరణలో బాంబు అమర్చినట్లు హెచ్చరించాడు. ఈ సమాచారం అందుకున్న కోర్టు సిబ్బంది తక్షణమే పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు.
Bomb Threat Triggers Panic at #Hyderabad #CityCivilCourt and #GymkhanaClub
A bomb threat email sent to the Chief Justice of the Hyderabad City Civil Court on Monday triggered panic and chaos, leading to an immediate evacuation of the court premises.
The email claimed that an… pic.twitter.com/7vQV3aTGXX
— BNN Channel (@Bavazir_network) July 8, 2025
హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్(Bomb squad), డాగ్ స్క్వాడ్(Dog Squad) బృందాలతో కోర్టుకు చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, లోపల ఉన్నవారందరినీ బయటకు పంపించివేశారు. అనంతరం బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ ఘటనతో కోర్టు వద్ద కాసేపు గందరగోళం నెలకొంది.
రాజ్‌భవన్‌కు కూడా బెదిరింపు మెయిల్
ఇదిలా ఉండగా జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్‌లో బాంబులు పెట్టినట్టు మెయిల్ రాగా డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మరో మెయిల్ లో రాజ్‌భవన్ (Raj Bhavan)లో RDX బాంబులు, ఐఈడీలు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు ప్రస్తుతం రాజ్ భవన్‌లో బాంబుస్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ లతో తనిఖీలు చేస్తున్నాయి.