
ఆషాఢ మాసం బోనాలు(Bonalu) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట(Golconda Kota)పై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ(Jagadambika Yellamma) ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభం కానుంది. ‘డిల్లం.. బల్లెం.. కుడకలు బెల్లం’ అంటూ ఆదిపరాశక్తి అమ్మవారికి దీపంపెట్టి సాక పోసి సల్లగ సూడమని మొక్కులు చెల్లించుకుంటూ తెలంగాణా(Telangana)లో చేసే జాతర బోనాలు. హైదరాబాద్(HYD)లో ఏటా ఆషాఢ మాసం(Ashada Masam)లో భక్తులు ఈ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఏడాది పండుగ రానే వచ్చింది.
నెల రోజులు భాగ్యనగరంలో సందడే సందడి..
ఆడబిడ్డలు ఎక్కించే బోనాలు అమ్మవారి సోదరులుగా భావించే పోతురాజులు చేసే విన్యాసాలు.. శివసత్తుల నృత్యాలు ఏనుగు అంబారీలు, తొట్టెల ఊరేగింపులు ఫలహార బళ్ల ప్రదర్శనలు ఇలా ఒకటేమిటి నెల రోజులు భాగ్యనగరంలో సందడే సందడి. బోనం అంటే పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన కుండలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అన్నం, బెల్లం. అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పణను తెలంగాణలో వివిధ నెలల్లో ఓ పండుగలా నిర్వహిస్తారు.
జులై 13న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీకి బోనం
గోల్కొండ కోటలోని జగదాంబిక-మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు ప్రారంభం కానుండగా జులై 13న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ(Secunderabad Ujjain Mahankali) అమ్మవారి ఆలయంలో బోనాలు జరగనున్నాయి. వీటినే లష్కర్ బోనాలు(Lashkar Bonalu) అంటారు. ఆ రోజు సీఎం రేవంత్(CM Revanth) రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జులై 20న లాల్‌దర్వాజ సింహవాహినీ మహంకాళీ(Laldarwaja Simha Vahini Mahankali) ఆలయంలో జరిగే రంగం వేడుకలు జరగనుండగా 24వ తేదీతో నగరంలో బోనాల వేడుకలు ముగుస్తాయి. కాగా తెలంగాణలో బోనాల పండగ(Bonala Pandaga)కు 600 ఏళ్ల చరిత్ర ఉన్న విషయం తెలిసిందే.