ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. స్మార్ట్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘పుష్ప 2: ది రూల్(Pushpa 2: The Rule)’. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో సునీల్, అనసూయ భరద్వాజ్,జగపతిబాబు, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీల(Srileela) స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, స్పెషల్ సాంగ్ విడుదల అవ్వగా భారీ రికార్డులు క్రియేట్ చేసాయి. అంతేకాదు అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్, స్పెషల్ సాంగ్ రికార్డు సృష్టించాయి. కాగా డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే పుష్ప 2 ప్రీ బుకింగ్స్(Pre Bookings) కూడా ఓపెన్ కావడం.. టికెట్లన్నీ(Tickets Sold Out) హాట్ కేకుల్లా అమ్ముపోవడమూ జరిగిపోయాయి.
ధరల పెంపునకు తెలంగణ గ్రీన్ సిగ్నల్
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు(To raise ticket prices) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు బెనిఫిట్‌షో(Benefitshow)తో పాటు అర్ధరాత్రి ఒంటి గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచింది. ఈషో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్(Multiplex) ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర ర.1000 అవుతుండగా, మల్టీఫ్లెక్స్‌లో రూ.1200లకుపైగా అవుతుంది. డిసెంబర్ 5 నుంచి 8 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. 9 నుంచి 16 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. 17 నుంచి 23 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పుష్ప-2 ఆరు భాషల్లో 12 వేలకుపైగా థియేటర్లలో విడుదల కానుంది.
ట్రెండింగ్‌లోకి కొత్త డిమాండ్
ఇంత వరకూ బాగానే ఉన్నా..తెలంగాణలో ఈ సినిమాను బాయ్ కాట్(Boycott) చేయాలంటూ ఒక కొత్త డిమాండ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి కారణం టికెట్ ధరలే అని సమాచారం. ముఖ్యంగా మైత్రి ప్రొడక్షన్ హౌస్(Maitri Production House) నుంచి వస్తున్న ఈ సినిమాకు టికెట్ ధరలు భారీగా పెంచేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీగా ధరలు పెంచేశారు. ప్యూర్ లీ సెల్ఫిష్ మూవీ అందుకే తెలంగాణలో దీనిని బాయ్‌కాట్ చేయాలి అంటూ #BoycottPushpa2TheRule ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ఫ్యామిలీలోని నలుగురు సినిమా చూడాలంటే దాదాపు రూ.3000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత పెట్టి సినిమా చూడమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/rvdrarm/status/1862828548265812326






