Mana Enadu : తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. టీటీడీ ఛైర్మన్(TTD Chairman)గా టీవీ5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడిని నియమిస్తూ.. 24 మందితో ధర్మకర్తల మండలిని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. సభ్యులుగా ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు వివిధ రంగాల నుంచి మరో 20 మందిని నియమించింది. పాలకమండలిలో సగానికి పైగా ఇతర రాష్ట్రాల వారికి పదవులు దక్కడం గమనార్హం. ఇందులో భాగంగా తెలంగాణ (Telangana) నుంచి ఐదుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి ఒక్కొక్కరు చొప్పున చోటు దక్కింది.
టీటీడీ బోర్డు సభ్యులు వీరే:
- టీటీడీ ఛైర్మన్ : బీఆర్ నాయుడు
- జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
- ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
- పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
- జాస్తి పూర్ణ సాంబశివరావు
- శాంతారామ్
- శ్రీసదాశివరావు నన్నపనేని
- జంగా కృష్ణమూర్తి
- కోటేశ్వరరావు
- మల్లెల రాజశేఖర్ గౌడ్
- జానకీ దేవి తమ్మిశెట్టి
- నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
- బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)
- అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
- బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
- సుచిత్ర ఎల్ల (తెలంగాణ)
- కృష్ణమూర్తి ( తమిళనాడు)
- పి.రామ్మూర్తి (తమిళనాడు)
- దర్శన్. ఆర్.ఎన్ (కర్ణాటక)
- జస్టిస్ హెచ్‌ఎల్ దత్ (కర్ణాటక)
- నరేశ్‌కుమార్ ( కర్ణాటక)
- డా.అదిత్ దేశాయ్ (గుజరాత్)
- శ్రీసౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)
- టీటీడీ ఛైర్మన్ గా నియమితులైన బొల్లినేని రాజగోపాల నాయుడు (BR Naidu) సామాన్య రైతు కుటుంబానికి చెందిన వారు. తిరుపతి జిల్లా పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ దిగువ పూనేపల్లె గ్రామంలో మునిస్వామినాయుడు, లక్ష్మి దంపతులు ఆయన జన్మించారు. 1969-70 ప్రాంతంలో హైదరాబాద్‌కు వెళ్లిన నాయుడు.. బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘం నాయకుడిగా పని చేసిన ఆయన.. 2007లో టీవీ5 టెలివిజన్ సంస్థను స్థాపించారు.






