హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం(Brahmanandam) తన కుమారుడు రాజా గౌతమ్(Raja Gautam) కలిసి నటించిన తాజా చిత్రం బ్రహ్మాఆనందం(Brahma Aanandam). ఈ సినిమాలో వీరిద్దరు తాత-మనవళ్లుగా కనిపించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ RVS నిఖిల్ ఈ మూవీని కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కించారు. కాగా ఈ చిత్రాన్ని గతనెల ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందకు తీసుకురాగా.. హిట్ టాక్ సాధించింది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్(OTT streaming date) ఫిక్సయింది.

ఈ మూవీని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ‘ఆహా(Aha)’ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. మార్చి 20వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో ప్రసారమవుతుంది. అయితే, ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు ప్రత్యేక ఆఫర్‌గా, మార్చి 19 నుంచే వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.
బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సూపర్
కాగా ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ టైమింగ్(Brahmanandam Comedy Timing), నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. థియేటర్ ఆర్టిస్ట్‌గా బ్రహ్మానందం పరిచయం, సెల్ఫిష్ నేచర్, మిత్రుడు గిరితో అతడి రిలేష్‌ను చూపిస్తూ ఫన్నీగా ఈ మూవీ మొదలవుతుంది. క్యారెక్టర్స్ ఎస్లాబ్లిష్ చేస్తూ ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశాడు డైరెక్టర్. బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెలకిషోర్ పోటీపడి వేసే పంచ్‌లు నవ్విస్తాయి.







