టెలివిజన్ రంగంలో సినిమాలకంటే ఎక్కువగా సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన నటీమణులు హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోరు. తమ నటనతో పాటు గ్లామర్‌తోనూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. సినిమాల్లో నటించే హీరోయిన్స్‌ను బీట్ చేసేలా, టీవీ యాక్ట్రెస్‌లు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు.

కన్నడ నటీనటులకు తెలుగు బుల్లితెరపై ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా స్టార్ మా సీరియల్స్‌లో ఎక్కువగా లీడ్ రోల్స్‌ను కన్నడ యాక్టర్లే పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మముడి'(Brahmamudi) సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది షర్మిత గౌడ్(Sharmitha Gowda).

మొదటి సీరియల్‌తోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అత్తా పాత్రలో నటించినా, ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. ముఖ్యంగా రుద్రాణి పాత్రలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

అయితే స్క్రీన్ మీద అత్తాగా కనిపించే షర్మిత గౌడ్, రియల్ లైఫ్‌లో మాత్రం పూర్తి బిన్నంగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తరచూ తన గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. చీరకట్టులో ఆకర్షణీయంగా మెరిసిపోతూనే, వెస్టర్న్ వేర్‌లో తన స్టైలిష్ సైడ్‌ను చూపిస్తోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు “ఈమె రుద్రాణియా?”, సినీ హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది సీరియల్స్‌లో అమ్మ, అత్త పాత్రల్లో కనిపించే ఈ గ్లామర్ బ్యూటీ.. రియల్ లైఫ్‌లో ట్రెండీగా మెరిసిపోతుండటం చూసి అశ్చర్యపోతున్నారు.






