సోదర బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ(Raksha Bandhan) శ్రావణ పూర్ణిమ(Shravan Purnima) రోజున దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు ఎంతగానో ఎదురుచూసే పండుగ రక్షాబంధన్ వచ్చేసింది. ఇక ఈరోజు (ఆగస్టు 9) రాఖీ పౌర్ణిమని జరుపుకునేందుకు సోదరసోదరీమణులు(Brothers and sisters) సిద్ధమయ్యారు. రక్షా బంధన్ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరులు సుఖ,సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రాఖీ కడతారు. ఈ రాఖీ(Rakhi Festival) పండుగ వచ్చిందంటే చాలు ఎంత దూరంలో ఉన్నా అన్నదమ్ములు ఇంటికి చేరిపోయి తోడబుట్టిన బంధాన్ని గుర్తు చేసుకునే ఎంతో సంతోషిస్తారు. ఈ పవిత్రమైన రోజున సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి, అతని దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు తన సోదరిని జీవితాంతం రక్షిస్తానని ప్రమాణం చేస్తాడు.

ఇదే శుభసమయం.. గుర్తుపెట్టుకోండి
లక్ష్మీదేవి(Goddess Laxmidevi)కి ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ జరుపుకుంటాం. ఇక ఈ రోజు ఉ.5:56-మ.1:24 గం.లోపు రాఖీ కట్టేందుకు శుభసమయమని పండితులు(Scholars) తెలిపారు. ఉదయాన్నే తల స్నానం చేసి దీపం వెలిగించాలి. పళ్లెంలో రాఖీ, వెండి నాణెం ఉంచి పూజ చేయాలి. అక్కాచెల్లెళ్లు తమ సోదరుడికి రాఖీ కట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు వేసి మిఠాయి తినిపించాలి. సోదరులు వారికి కానుకలు ఇవ్వాలి. ఇక రాఖీ కట్టేటప్పుడు, కట్టించుకునేటప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని దీనివల్ల విశేష శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.

రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్లు వేయాలంటే..
సోదరుడికి ఏదో రాఖీ కట్టేయడం కాదు. ఎప్పటికి మీకు రక్షగా ఉండాలని చెప్పడంతో పాటు సోదరుడి గొప్పగా, ఉన్నత స్థాయిలో ఉండాలని సోదరులు కోరుకుని రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్లు వేయాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మూడు మూళ్లు అనేవి బ్రహ్మ(Brahmma), విష్ణు(Vishnu), మహేశ్వరుల(Maheshwara)కు ప్రతీకగా భావిస్తారు. త్రిమూర్తులకు ప్రతీకగా తమ సోదరుడు సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్లు వేయాలి. రాఖీ కట్టేటప్పుడు వేసే మొదటి ముడి, సోదరుడి దీర్ఘాయుష్షు, భద్రత, శ్రేయస్సు, ఆనందాన్ని సూచిస్తుంది. రెండో ముడి అయితే సోదరుడు, సోదరి(Sister) మధ్య నమ్మకం, ప్రేమ, గౌరవాన్ని సూచిస్తుందని, మూడో ముడి గౌరవంతో సంతోషంగా జీవించాలని సూచిస్తుందని పండితులు అంటున్నారు. ఇలా మూడు ముళ్లు వేయకుండా రాఖీ కట్టడం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఉండదని పండితులు చెబుతున్నారు.







