Telanaga Politics: తెలంగాణలో పొలిటికల్ హీట్.. కేటీఆర్‌ అరెస్టుకు రంగం సిద్ధం!

Mana Enadu: తెలంగాణలో పాలిటిక్స్(Telanaga Politics) హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకూ కానిస్టేబుళ్లు, బెటాలియన్ కానిస్టేబుల్స్(Constables, Battalion Constables), వారి కుటుంబ సభ్యుల ఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. అంతకు ముందు గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల(Concerns of Group-1 candidates)తోనూ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు జోరుగా సాగాయి. ఈ విషయంలో చివరకు రేవంత్ సర్కార్‌(Revanth Govt)దే పై చేయి సాధించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సుప్రీంకోర్టు(Supreme court) కూడా గ్రూప్ పరీక్షలు ప్రారంభమైనందునా తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది. ఇక నిన్నటి నుంచి రాష్ట్రంలో పాలిటిక్స్ డైవర్షన్ తీసుకున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్(Congress vs BRS) అన్నట్లు సాగుతున్నాయి.

 దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయ్: మంత్రి

ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy చేసిన హాట్ కామెంట్సే(Hot comments) రాష్ట్రంలో తాజా పరిస్థితులకు నిదర్శనం. రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు(Political bombs) పేలుతాయంటూ మంత్రి పొంగులేటి కామెంట్స్ చేసిన నాటి నుంచి అరెస్టుల అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లతో పాటు ఫోన్ ట్యాపింగ్(Phone tapping) అంశాలపై విచారణలు జరుగుతున్నాయి. ఇందులో ఏదో అంశంపై చర్యలు ఉంటాయన్న ప్రచారం గత కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే పొలిటికల్ బాంబులు ఎప్పుడు పేలుతాయని మీడియా ప్రశ్నించగా. అయితే.. దీపావళి(Diwali)కి ముందే పేలుతాయని ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ సన్నిహిత వర్గాలు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఆ అరెస్ట్ అయ్యే BRS నేత ఎవరు అన్న అంశంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. KTR అరెస్ట్ అవుతారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

హైదరాబాద్‌లో 144 సెక్షన్

మరోవైపు హైదరాబాద్‌లో 144సెక్షన్(Section 144) విధిస్తూ సీపీ సీవీ ఆనంద్(Hyd CP CV Anand) సోమవారం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడితే అరెస్ట్ చేస్తామని.. ధర్నాలు, నిరసనలు, పబ్లిక్ మీటింగ్‌లకు నో పర్మీషన్ అని ప్రకటనలో పేర్కొన్నారు సీపీ. కేవలం ఇందిరాపార్క్‌ దగ్గర మాత్రమే ధర్నాకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రూల్స్ బ్రేక్స్ చేస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. దీపావళి సమయంలో ఈ సెక్షన్ విధించడం ఏంటని పలువురు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ అంశంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఈ ప్రకటనకు దీపావళి వేడుకలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *