అల్లు అర్జున్ స్నేహితుడిగా గీతా ఆర్ట్స్-2 వ్యవహారాలు చూసుకుంటున్న బన్నీ వాస్ (Bunny Vas) కొత్త బ్యానర్ పెట్టారు. బీవీ వర్క్స్ (BV Works)పేరిట కొత్త బ్యానర్ స్థాపించారు. అంతేకాదు సప్త అశ్వ క్రియేటివ్స్ , వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఆ మూవీకి సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్ తాజగా విడుదల చేసి ఆసక్తిని పెంచారు.
దర్శకుడిగా పరిచయం అవుతున్న విజయేంద్ర.ఎస్
ప్రీ-లుక్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి ఉన్న నలుగురు వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ సరికొత్త వినోదాత్మక చిత్రాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఫస్ట్ లుక్ను జూన్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మూవీతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. కాగా పోస్టర్లో ముసుగు ధరించి ఉన్నవారిలో ఒకరు ప్రియదర్శి అని తేల్చేసిన నెటిజన్లు.. మిగతావారు ఎవరా అని తెలుసుకునే పనిపడ్డారు.
Bunny Vas sets up his own Banner for the first time naming it as BV Works. A film to be unveiled in collaboration with Sapta Aswa Creatives and Vyra Entertainments.
Directed by debutant Vijayendar S. pic.twitter.com/7aVHMRHfV0
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 4, 2025






