Rythu Bharosa: రైతులకు తీపికబురు.. సంక్రాంతికి ముందే ‘రైతు భరోసా’?

రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ(Runa Maafi) చేసింది. దీంతోపాటు రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్(Bonus) అందజేస్తోంది. అయితే రైతులు మాత్రం గత BRS సర్కార్ అమలు చేసిన ‘రైతుబంధు(Rythubandhu)’ నగదు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్(Cm Revanth) ప్రభుత్వం రైతులకు ‘రైతు భరోసా'(Rythu Bharosa) పేరిట నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఇది ప్రకటన వరకే పరిమితమవడంతో అన్నదాతలు గుర్రుగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఇవాళ (జనవరి 2) మరోసారి క్యాబినెట్(Cabinet) సబ్ కమిటీ భేటీ కానుంది.

విధివిధానాలు ఖరారయ్యేనా..

ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. స‌మావేశంలో రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు విధివిధానాలు(Procedures) ఖరారు చేయనున్నారు. రైతులకు ఆర్థిక సహాయం, పంట నష్టాలకు పరిహారం, ఇంకా వ్యవసాయ రంగానికి మద్దతు అంశాలపై వివరంగా చర్చించనున్నట్లు సమాచారం.

క్యాబినెట్‌ సబ్ కమిటీ తీర్మానం

రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి(Sankranti)కి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల అసెంబ్లీ(Assembly Sessions) సమావేశాల్లో ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా స్పీడ్‌ పెంచుతోంది. సంక్రాంతికే రైతు భరోసా ఇవ్వాలని క్యాబినెట్‌ సబ్ కమిటీ(Cabinet Sub Committee) కూడా తీర్మానం చేయడంతో విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వొద్దనే దానిపై మంత్రివర్గం ఇవాళ చర్చించనుంది. అయితే అసలైన రైతుకే ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం అంటుంటే.. రకరకాల కండీషన్లు పెట్టి.. రైతులకు పథకం డబ్బు అందకుండా చేస్తున్నారని BRS ఆరోపిస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *