సినీ సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు ఒక సాధారణ ట్రెండ్‌గా మారింది. పుట్టినరోజు, పండుగలకు, సందర్భం ఏదైన సరే వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఫోటోలను తమ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఎంత క్యూట్ గా ఉందంటూ..
ఇటీవల ఓ అందమైన చిన్నార ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిక్ చూసిన వారంతా ఈ చిన్నారి ఎంత క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. సినిమా రంగంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పటికప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మా. ఇంతకీ ఈ చిన్నారి ఎవరంటే అక్కినేని కోడలు నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ.
తెలుగు అమ్మాయిగా..
తెలుగు అమ్మాయిగా ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన శోభిత, “రామన్ రాఘవ్ 2.0” హిందీ సినిమాతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అడవి శేష్‌తో కలిసి నటించిన “గూఢచారి” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. హిందీలో “ఘోస్ట్ స్టోరీస్”, మలయాళంలో “కురుప్”, తెలుగు-తమిళంలో “మేజర్”, “పొన్నియన్ సెల్వన్” వంటి చిత్రాలలో కూడా నటించింది.
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు
శోభిత పలు బోల్డ్ వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు లో ‘ది నైట్ మేనేజర్’ సీజన్ 2కి ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. సోషల్ మీడియాలో బాగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ డేట్ చేస్తుంటుంది.
పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు…
నాగ చైతన్యతో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న శోభిత, పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంట కలిసి ఆనందంగా జీవితం సాగిస్తున్నారు. ఇటీవల శోభిత గర్భవతిగా ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.






