వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2026)కు కెనడా(Canada) జట్టు అర్హత సాధించింది. అమెరికాస్ రీజినల్ క్వాలిఫయర్స్ ఫైనల్(Americas regional qualifying finals-2025)లో భాగంగా కెనడా T20 ప్రపంచకప్ టికెట్ కన్ఫార్మ్ చేసుకుంది. బహమాస్(Bahamas)తో జరిగిన మ్యాచులో కెనడా ఏడు వికెట్లతో విజయం సాధించింది. ఈ టోర్నీలో కెనడా వరుసగా ఐదు విజయాలు సాధించి, పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గతసారి(2024)లో కూడా కెనడా ఇదే మార్గంలో ప్రపంచ కప్‌లోకి ప్రవేశించింది. దీంతో 2026 T20 ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకున్న 13వ జట్టుగా కెనడా నిలిచింది.
మొత్తం 20 జట్లతో టీ20 ప్రపంచకప్
కాగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings)లో టాప్-8లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్‌కు సాధించగా, ఇండియా, శ్రీలంక ఆథిత్య దేశాలుగా స్థానం సాధించాయి. వీటిలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, USA, వెస్టిండీస్ ఉండగా.. రెండు ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంక కూడా ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో 13వ జట్టుగా కెనడా చేరింది.
మరో 7 జట్లకు అవకాశం
కాగా మరో ఏడు జట్లు ఇప్పుడు అర్హత సాధించాల్సి ఉంది. అందులో రెండు యూరోపియన్ క్వాలిఫైయర్(European qualifier) నుంచి, రెండు ఆఫ్రికన్ క్వాలిఫైయర్(African qualifier) నుంచి రావాల్సి ఉంది. అలాగే మరో మూడు జట్లు ఆసియా-EAP క్వాలిఫైయర్(Asia-EAP Qualifier) నుంచి అర్హత సాధించాల్సి ఉంది. కాగా 20 జట్లతో జరిగే మొట్టమొదటి T20 ప్రపంచ కప్-2026 కావడం విశేషం. అన్ని దేశాల్లో క్రికెట్‌కు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ICC చిన్నజట్లకు కూడా అవకాశం కల్పించింది.
Canada qualify for the 2026 T20 World Cup! 🇨🇦🔥
A historic moment for Canadian cricket on the global stage. pic.twitter.com/t5IWftM793
— CricTracker (@Cricketracker) June 22, 2025






