TGPSC Group-3: ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. అభ్యంతరాల వెల్లడికీ అవకాశం

నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ కమిషన్(Telangana Public Commission) శుభవార్త చెప్పింది. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల(Group-3 Exams)కు సంబంధించిన ప్రిలిమినరీ కీ(Preliminary key)ని తాజాగా రిలీజ్ చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా TGPSC ఐడీ, Hall Ticket No, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి KEYని పొందొచ్చు. 12వ తేదీ వ‌ర‌కు గ్రూప్-3 కీ అందుబాటులో ఉండ‌నుంది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్​-3 ప్రిలిమినరీ కీతో పాటు టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(Town Planning Building Overseer) ఫలితాలను కూడా TGPSC విడుదల చేసింది.

50 శాతం మందే హాజరయ్యారు

అలాగే అభ్యంత‌రాల‌ను ఇంగ్లిష్(English) తెలపాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్‌లైన్‌(Online)లోనే పంపాలని సూచించారు. గ్రూప్‌-3 పరీక్షలను TGPSC 2024 నవంబర్‌ 17, 18వ తేదీల్లో నిర్వహించింది. మొత్తం 1365 పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మూడు పేపర్లకు నిర్వహించిన ఈ పరీక్షలకు 50 శాతం మందే హాజరవ్వడం గమనార్హం.

వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *