NTR on War-2: ఆగస్టు 14న కలుద్దాం.. వార్-2 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2(War-2)’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా జూనియర్ తారక్ ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి తన పాత్ర చిత్రీకరణ పూర్తయినట్లు ఆయన సోషల్ మీడియా(Social Media) వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన సహనటుడు హృతిక్ రోషన్‌, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సినిమా ప్రయాణం తనకు ఎన్నో విషయాలు నేర్పిందని తారక్ పేర్కొన్నారు.

War 2 Teaser: The Story of India's Best Soldiers - Telugu360

హృతిక్‌ రోషన్‌ ఎనర్జీకి ఆకర్షితుడినయ్యా..

‘‘వార్‌ 2’ చిత్రీకరణ పూర్తయింది. హృతిక్‌ రోషన్‌ సర్‌ సెట్స్‌లో ఉన్నంతసేపూ సందడిగా ఉంటుంది. ఆయన ఎనర్జీ(Energy)కి ఆకర్షితుడినయ్యా. సెట్‌లో రోషన్ సర్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి. ఆయన ఎనర్జీని నేను ఎప్పుడూ ఆరాధిస్తాను. ఈ సినిమా ప్రయాణంలో ఆయన్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా ద్వారా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ(Director Ayan Mukherjee) ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌ సిద్ధం చేశారు. ఈ చిత్రానికి పని చేసిన ‘యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌(Yash Raj Films)’ టీమ్‌కి బిగ్‌ థాంక్స్‌’’ అని తారక్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆగస్టు 14న థియేటర్లలో చూడటానికి సిద్ధంగా ఉండాలని అభిమానులను కోరారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ సంస్థ విడుదల చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 7,500 స్క్రీన్స్‌లో ఈ సినిమాని ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్స్‌కి ప్లాన్?

కాగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక, NTR అభిమానుల కోసం ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున స్పెషల్ ప్రీమియర్స్(Special Premieres) వేయాలని నాగవంశీ(Nagavamshi) ప్రయత్నిస్తున్నారు. దీని కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాన్ని ఆయన అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది. గతంలో దేవర(Devara) చిత్రానికి కూడా ఇలా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీతో నాగవంశీ ముందుకెళ్లాలని చూస్తున్నారు. మరి ‘వార్-2’ చిత్రానికి ప్రీమియర్ షోలు వేసేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనేది చూడాలి.

War 2 release date: Hrithik Roshan - Jr NTR starrer film to release on THIS  date - check details | Mint

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *