అత్యంత ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ (Wimbledon 2025) ఈ రోజు (జూన్ 30, 2025) నుంచి లండన్(London)లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ 138వ ఎడిషన్‌లో గ్రాస్ కోర్టు(Grass Courts)లపై రెండు వారాల పాటు ఉత్కంఠభరిత పోరాటాలు జరగనున్నాయి. ఈ ఏడాది టోర్నమెంట్ జులై 13 వరకు కొనసాగనుంది. మొత్తం £53.5 మిలియన్ల ప్రైజ్ మనీ(Prize Money)తో ఈ వింబుల్డన్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. కాగా మెన్స్ సింగిల్స్(Men’ Single)లో రెండుసార్లు ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) తన టైటిల్‌ను కాపాడుకునేందుకు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్, క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌గా రాణిస్తున్న అల్కరాజ్‌ను జన్నిక్ సిన్నర్, నోవాక్ జొకోవిచ్(Novak Djokovic), అలెగ్జాండర్ జ్వెరెవ్‌లు సవాల్ చేయనున్నారు.

మహిళల సింగిల్స్‌లో ఎవరెవరంటే..
ఇక మహిళల సింగిల్స్(Women’s Sinle)లో ఆర్యన సబలెంకా(Aryana Sabalenka), కోకో గాఫ్, మార్కెటా వొండ్రౌసోవా, ఎలెనా రైబకినా వంటి స్టార్ ఆటగాళ్లు టైటిల్ కోసం పోటీపడుతున్నారు. 2023 విజేత వొండ్రౌసోవా బెర్లిన్ ఓపెన్(Berlin Open)లో సబలెంకాను ఓడించి ఫామ్‌లో ఉంది. బ్రిటన్ ఆటగాళ్లైన ఎమ్మా రాడుకాను, కేటీ బౌల్టర్, జాక్ డ్రాపర్‌లు స్థానిక అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా రాడుకాను తొలి రౌండ్‌లో యువ ఆటగాడు మిమి జుతో తలపడనుంది. కాగా ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ జులై 12న, మెన్స్ సింగిల్స్ ఫైనల్ జులై 13న జరగనుంది.

ఈ టోర్నమెంట్‌లో ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ సిస్టమ్‌ను పూర్తిగా అమలు చేస్తున్నారు, ఇది ఆటలో కచ్చితత్వాన్ని పెంచనుంది. ఈ మ్యాచులను BBC, ESPN, స్కై స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. హులు ప్లస్ లైవ్ టీవీ, ESPN+ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.
Wimbledon begins today! 🌱
Alcaraz faces Fognini, Sinner starts as No. 1, Gauff and Sabalenka in action.#Wimbledon2025 #Alcaraz #Sinner #Gauff #Sabalenka pic.twitter.com/cjIYfKLt9k— CourtSideNotes (@MrugankR) June 30, 2025






