
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై ఏసీబీ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నాన్-బెయిలబుల్ సెక్షన్లైన 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120 B కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి KTRను A-1గా KTR, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా HMDA చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిని చేర్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఓఆర్ఆర్ టెండర్లపైనా కేసు
ఇదిలా ఉండగా ఓఆర్ఆర్ టెండర్లను ప్రైవేట్‌కు అప్పగించడంపైనా కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా కేటీఆర్ కేసులపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు సిట్ వేయాలని ఆయన కోరారు. టెండర్ రద్దు చేసి విచారణ ప్రారంభించాలని పేర్కొన్నారు. గతేడాది హైదరాబాద్‌లో చేపట్టిన ఈ ఫార్ములా రేసింగ్(formula e hyderabad)లో జరిగిన అవకతవకలపై కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ ఇదివరకే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అనుమతి పత్రాన్ని గవర్నర్ సీఎస్ శాంతికుమారికి (CS Shanthi kumari) పంపించారు. ఆ లేఖను ఏసీబీ (ACB) అధికారులకు అందజేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో ఈ అనుమతి లేఖను సీఎస్ శాంతి కుమారి ఏసీబీ అధికారులకు అందించారు.
ACB Files Case Against KTR, IAS Officer, and HMDA Officer Over Formula-E Race Funds transfer
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే KTRపై ఏసీబీ కేసు నమోదు
🔸ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డి పైనా కేసు నమోదు అయింది.
🔸ఫార్ములా-ఈ కార్ రేస్… pic.twitter.com/Whbl3we5Eg— Congress for Telangana (@Congress4TS) December 19, 2024
గవర్నర్ అనుమతితోనే
ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌పై (KTR) కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. దాదాపు నెల రోజుల తరువాత గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని, సాధ్యమైనన్ని అంశాలపై చర్చించే దమ్ముందా అని కేటీఆర్ అసెంబ్లీలో సవాల్ విసిరిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.