Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పుష్ప-2 : ది రూల్’. ఈ సినిమా డిసెంబరు 6 (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమా ప్రీమియర్ షో స్క్రీనింగ్ జరిగింది. ఈ షోకు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని మృతి చెందగా.. ఓ చిన్నారి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.
అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు
ఈ క్రమంలోనే తాజాగా చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదైంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ (Sandhya Theater Pushpa 2)కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు ఓవైపు సంధ్య థియేటర్ యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు. మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun Team Case) వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆయన టీమ్‌పై కూడా కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగిన విషయం
పుష్ప-2 బెనిఫిట్ షో (Pushpa 2 Premier Sandhya) కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి ఓ కుటుంబం కూడా వచ్చింది. అయితే 9.30 గంటల సమయంలో అక్కడికి అల్లు అర్జున్ రావడంతో అభిమానులు ఆయణ్ను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి(35) అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడి జనం కాళ్ల మధ్య నలిగిపోవడంతో మహిళ మృతి (Pushpa 2 Fan Death) చెందింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
అల్లు అర్జున్ టీమ్ రియాక్షన్ ఇదే
ఈ ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందిస్తూ.. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. తమ టీమ్ ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ఇదే ఘటనపై పుష్ప ప్రొడ్యూసర్స్.. మైత్రీ మూవీ మేకర్స్ (Mytrhi Movie Makers) స్పందిస్తూ.. బాలుడు క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నామని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత వరకు అన్ని విధాల సహాయపడతామని వెల్లడించింది.






