ManaEnadu: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న కులగణన(Caste Census) కార్యక్రమం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి వారం రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కులగణన సర్వే బాధ్యతలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల(primary school teachers)కు అప్పగించగించడంతో సర్వే(Survey) పూర్తయ్యేవరకు ఒంటిపూట మాత్రమే పనిచేయనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నంఒంటి గంట వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. ఆ తర్వాత కులగణన సర్వే(Census Survey) కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో 85వేల మంది పాల్గొననుండగా, 36,559 మంది ప్రాథమిక పాఠశాలలకు చెందిన SGT ఉపాధ్యాయులు, 3414 మంది ప్రాథమిక పాఠశాలలకు చెందిన హెడ్మాస్టర్లు ఉన్నారు. మిగతా వారిలో ప్రభుత్వ మినిస్ట్రీయల్ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొనున్నారు.
పార్ట్-1లో ఉండే వివరాలు ఇవే
ఇంటింటికీ సమగ్ర సర్వే(A comprehensive house-to-house survey) సామాజిక, ఆర్థిక, విద్య, ఉపా ధి, రాజకీయ, కులాల సర్వేకు సంబంధించిన ప్రశ్నావళిని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 56 ప్రధాన ప్రశ్నలతో పాటు 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలను ఖరారు చేసింది. Part-1లో యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధిం చి 58 ప్రశ్నలుండగా Part-2లో కుటుంబ వివరాలకు సం బంధించి 17 ప్రశ్నలున్నాయి. Part-1లో వ్యక్తిగత వివరాల్లో మతం, సామాజిక వర్గం, కులం, ఉప కులంతో పాటు మాతృభాష, వైవాహిక స్థితి, పాఠశాల రకం, విద్యార్హత, ఉద్యోగం, ఉపాధి, కులవృత్తి, వార్షిక ఆదాయం, ITరిటర్న్, స్థిరాస్తులు, ధరణి పాసుబుక్ నెంబర్, రిజర్వేషన్‌తో పొందిన ప్రయోజనాలు, గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన సంక్షేమ పథకాల పేర్లు, రాజకీయ నేపథ్యం, వలస వివరాలను సేకరిస్తారు.
పార్ట్-2లో కుటుంబ వివరాలు
కుటుంబ వివరాలు Partలో నమోదు చేస్తారు. ఇందులో గత ఐదేళ్లలో తీసుకున్న రుణాల(Loans) వివరాలు, పశుసంపద, స్థిరాస్తి, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు నెంబర్, నివాస గృ హం రకం, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్ వివరాలు తెలపా ల్సి ఉంటుంది. ఆధార్ వివరాలు తప్పనిసరి కాదని ఇందులో స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే లాంటి ప్రశ్నలనే ప్రభుత్వం ఇందులో పొందుపరిచింది.






