ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), ఆయన నివాసం, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శనివారం దాడులు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిర్యాదు మేరకు రూ. 2,000 కోట్ల బ్యాంకు మోసం(Bank Fraud) కేసులో ఈ చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఆర్‌కామ్‌తో పాటు అనిల్ అంబానీపై కూడా సీబీఐ FIR నమోదు చేసింది. ముంబైలోని అనిల్ అంబానీ నివాసమైన సీవిండ్, కఫ్ పరేడ్‌లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఈ సమయంలో అనిల్ అంబానీ, ఆయన కుటుంబం ఇంట్లో ఉన్నట్లు సమాచారం. ఆర్‌కామ్‌కు సంబంధించిన ఇతర కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి.
రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో
SBI ఫిర్యాదు ప్రకారం, ఆర్‌కామ్ రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుకు రూ. 2,227.64 కోట్లు, వడ్డీ(Interest)తో సహా నష్టం వాటిల్లింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం జూన్ 13, 2025న ఈ ఖాతాను “మోసం”గా వర్గీకరించారు. ఈ దాడులకు ముందు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రూ. 17,000 కోట్ల మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీని ప్రశ్నించింది.
కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్‌లు స్వాధీనం
ఆర్‌కామ్ గతంలో దేశంలో అగ్రగామి టెలికాం సంస్థగా ఉన్నప్పటికీ, అప్పులు, పోటీ, ఆదాయం తగ్గడంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం ఆర్‌కామ్ ఇన్సాల్వెన్సీ(RCom Insolvency) ప్రక్రియలో ఉంది. ఈ దాడులతో అనిల్ అంబానీపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈడీ దాడుల్లో కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సీబీఐ కూడా దాడులు చేయడంతో అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది.
#CBI raided premises related to #RCom and #anilambani. In the case of a #bankfraud of Rs 17000 crores. FIR has been filed against Anil Ambani in this case. Anil Ambani is present in the house during the raid, which has been going on since Saturday morning.#ambanifamily #Ambani pic.twitter.com/pMfkoAmCI6
— NEWSLINE (@SanjeevCrime) August 23, 2025






