
దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు(Anti-India Content) పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర హోంశాఖ(Ministry Of Home Affairs) అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఓ కొత్త పాలసీ(New Policy)ని సైతం తీసుకురాబోతున్నట్టు సమాచారం. సోషల్ మీడియా(Social Media)లో నెటిజన్లు, క్రియేటర్లు పెట్టే కంటెంట్ పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులు(Anti-national posts) పెడుతున్నవారిని గుర్తించేందుకు ఓ టీమ్‌ను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా పోస్టులు పెడుతున్నవారి అకౌంట్స్ బ్లాక్(Block of Accounts) చేయడమే కాకుండా వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుస్తోందట.
అయితే కేంద్రం చాలా కాలంగా SMపై నియంత్రణ తీసుకువస్తామని చెబుతోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో కొంతమంది యూట్యూర్లు(Youtubers), నెటిజన్లు పాకిస్థాన్(Pakistan)కు మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టడంతో వారిపై సైతం నిఘా పెట్టి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో వ్యతిరేక పోస్టులపై పాలసీ తీసుకువస్తే ఎల్లప్పుడు నిఘా పెట్టవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
देशविरोधी व्हायरल व्हिडिओ आणि कंटेंट ब्लॉक केले जातील! सरकार आणत आहे राष्ट्रीय धोरण@AmitShah #AmitShah #NationalPolicyhttps://t.co/VLVmbQaCOE
— Azad Marathi (@AzadMarathi) July 4, 2025