
హైదరాబాద్‌లో వాతావరణం(Weather in Hyderabad) ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా ఎండలు, తేలికపాటి వానలతో సాగిన వాతావరణం ఇప్పుడు పూర్తిగా మేఘాలతో నిండి కనిపిస్తోంది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి నుంచి వర్షం(Rain) కురుస్తోంది. నిన్న ఉదయం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉదయం 10 గంటల వరకు కురిశాయి. ప్రధానంగా సికింద్రాబాద్, బేగంపేట్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇటు శుక్రవారం ఉదయం నుంచి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చినుకులు పడుతున్నాయి.
రేపు ఉదయం వరకూ వానలే..
ఇదిలా ఉండగా AP, తెలంగాణ(Telangana)లో గాలివేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందని చెప్పింది. కొన్ని సందర్భాల్లో గాలి వేగం గంటకు 70కిలోమీటర్లకు కూడా చేరుతుందని IMD తెలిపింది. సాధారణంగా తుపాన్ వచ్చినప్పుడు మనకు ఇలాంటి గాలులు వీస్తాయని.. ఇప్పుడు తుపాన్ లేకపోయినా ఈ పరిస్థితి ఉందని తెలిపింది. నేడు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఈరోజు రాత్రి 10 తర్వాత ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, ఇవి 17వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.