ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగులు Provident Fund (PF ) తమ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా లేదా ఆన్‌లైన్ సైట్‌లో లోడింగ్ సమస్యలు వస్తే కొంతమందికి కంగారుగా ఉంటుంది. కానీ అలాంటి సమయంలో నిరాశపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేకుండా, కేవలం మీ మొబైల్ ఫోన్ ద్వారా PF బ్యాలెన్స్ తెలుసుకునే మూడు సులభమైన మార్గాలు ఉన్నాయి.
ఈ క్రింద తెలిపిన మూడు మార్గాల్లో మీరు ఇంటర్నెట్ అవసరం లేకుండా మీ PF వివరాలు తెలుసుకోవచ్చు.
1. SMS ద్వారా PF బ్యాలెన్స్ తనిఖీ చేయడం
మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 77382 99899 నంబర్‌కు SMS పంపడం ద్వారా PF బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు.
తీసుకోవాల్సిన చర్యలు:
మీ ఫోన్‌లో SMS యాప్ ఓపెన్ చేయండి.
“EPFOHO UAN ENG” అని టైప్ చేసి 77382 99899 కు పంపండి.
“ENG” స్థానంలో మీకు కావలసిన భాషా కోడ్ వాడొచ్చు. ఉదా:
HIN – హిందీ
TEL – తెలుగు
TAM – తమిళం
MAR – మరాఠీ
BEN – బెంగాలీ
గమనిక: ఈ సేవ పొందాలంటే మీ UAN యాక్టివేట్ అయి ఉండాలి. అలాగే మీ ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వంటి KYC వివరాలు లింక్ అయి ఉండాలి.
2. మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్ తెలుసుకోవడం
మీరు ఉచిత మిస్డ్ కాల్ ద్వారా కూడా PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
తీసుకోవాల్సిన చర్యలు:
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425 కు కాల్ చేయండి.
కాల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.
తర్వాత కొద్దిసేపట్లోనే మీ మొబైల్‌కు PF బ్యాలెన్స్ మరియు ఇతర వివరాలుతో కూడిన SMS వస్తుంది.
గమనిక: ఈ సేవ పొందాలంటే మీరు UAN యాక్టివేట్ చేసి ఉండాలి. KYC వివరాలు కూడా అప్‌డేట్ అయి ఉండాలి.
3. వాట్సాప్ ద్వారా PF బ్యాలెన్స్ చెక్ చేయడం
EPFO ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా PF వివరాలను అందిస్తోంది.
తీసుకోవాల్సిన చర్యలు:
EPFO వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, మీ ప్రాంతీయ కార్యాలయ WhatsApp నంబర్‌ను గుర్తించండి.
ఆ నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
వాట్సాప్‌లోకి వెళ్లి “Hi” లేదా “PF Balance” అని మెసేజ్ పంపండి.
చాట్‌బాట్ మీ ఖాతా వివరాలు, బ్యాలెన్స్, లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ మొదలైన సమాచారం పంపుతుంది.
ఇతర ముఖ్యమైన సమాచారం
వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి నిర్మాణం, విద్య, పదవీవిరమణ లేదా నిరుద్యోగ పరిస్థితుల్లో మీ PF డబ్బును పాక్షికంగా లేదా పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.
ఏదైనా సేవలు పొందడంలో ఇబ్బంది ఉంటే:
మీ సంస్థలోని HR/పేరోల్ విభాగాన్ని సంప్రదించండి
లేదా EPFO టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1800-118-005 కు కాల్ చేయండి.






