క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించిన ‘పాతాళ్‌లోక్’ సీజన్ 1కు స్వీక్వెల్‌గా ‘పాతాళ్ లోక్ 2’ (Paatal Lok Season 2) తెరకెక్కుతోంది. సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజైంది. ‘ఈ వ్యవస్థ ఓ పడవలాంటిది. రంధ్రాలున్నాయని అందరికీ తెలుసు. కానీ, నువ్వు మునిగిపోయే పడవను కాపాడాలనుకుంటున్నావు. నువ్వూ చస్తావు చౌదరీ..’ అంటూ ఆసక్తిని పెంచింది ‘పాతాళ్‌లోక్ 2’ ట్రైలర్. 2020లో రిలీజైన ‘పాతాళ్ లోక్’ సిరీస్ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ భారీ విజయం అందుకోవడంతో రెండో సీజన్‌ను తెరకెక్కించారు. అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.
తాజాగా ట్రైలర్‌ను (Paatal Lok Season 2 Trailer) రిలీజ్ చేసింది చిత్ర బృందం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) జనవరి 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘పాతాళలోకం గురించి నీకు తెలుసా? అక్కడకు వెళ్తే, ఎవరూ తిరిగిరారు’ అని ట్యాక్సీ డ్రైవర్ అంటే, ‘నేను పాతాళలోకంలో పర్మినెంట్ నివాసిని’ అంటూ హథీరామ్ చెప్పే డైలాగులు సిరీస్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ ట్రైలర్‌ని చేసేయండి..






