ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడుతోంది. ఎకనా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధోనీ తెలిపాడు. జట్టులో రెండు మార్పులు చేసింది. ఆశ్విన్, కాన్వే స్థానాల్లో ఓవర్టన్, రషీద్‌ను తీసుకుంది. కాగా ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ చెన్నైకి చాలా కీలకం.
MS DHONI THANKING THE LUCKNOW CROWD FOR THEIR SUPPORT 💛#ipl #IPL2025 #CSKvsLSG #CSKvLSG #LSGvCSK #LSGvsCSK #MIvsDC #DCvMI #AyushMhatre pic.twitter.com/epI3zec0Ok
— IPL 2025 (@bgt2025) April 14, 2025
అటు లక్నో ప్లేయర్ గత మ్యాచ్ సమయంలో కూతురి అనారోగ్యం కారణంగా దూరమైన మార్ష్(Mitchel Marsh) తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరగగా, లక్నో మూడు మ్యాచుల్లో నెగ్గింది. చెన్నై కేవలం ఒక మ్యాచులోనే విజయం సాధించగా.. మరో మ్యాచ్ ఫలితం తేలలేదు.
తుది జట్లు ఇవే..
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(W/C), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని(W/C), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ
Sheik Rashid and Jamie Overton are playing for CSK today, and Devon Conway and R Ashwin have been benched.
Mitch Marsh is back for LSG in place of Himmat Singh! #IPL2025 #LSGvsCSK pic.twitter.com/JHTGErjNzf
— OneCricket (@OneCricketApp) April 14, 2025






