IPL 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 5 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న వేళ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ MS ధోనీ(11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీ రోల్ పోషించాడు.
పంత్ చాలా రోజుల తర్వాత
ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), అబ్దుల్ సమద్(11 బంతుల్లో 2 సిక్స్‌లతో 20) కీలక ఇన్నింగ్స్ ఆడారు. CSK బౌలర్లలో జడేజా(2/24), పతీరణ(2/45) రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఓటమి ఖాయమనుకున్న్ తరుణంలో..
అనంతరం CSK 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది. ధోనీతో పాటు శివమ్ దూబే(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), రచిన్ రవీంద్ర (37), అరంగేట్ర తెలుగు ప్లేయర్ షేక్ రషీద్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27) రాణించారు. LSG బౌలర్లలో రవి బిష్ణోయ్(2/18) రెండు వికెట్లు తీయగా.. దిగ్వేజ్ రతి, అవేశ్, మార్క్‌రమ్ తలో వికెట్ తీశారు. CSK ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో ధోనీ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పడంతో అతడినే ‘‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’’ అవార్డు వరించింది.
No CSK fan will scroll down without liking this video.
CSK ended their 5 match losing streak.#CSKvsLSG #LSGvsCSK #MSDhoni𓃵pic.twitter.com/CfVxX7pV7j— Tata IPL 2025 Commentary (@IPL2025Auction) April 14, 2025






