భరత జాతి ముద్దబిడ్డ.. వీరత్వం పరాక్రమానికి ప్రతీక.. మరాఠాల ఆశాదీపం ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj). ధర్మ స్థాపన కోసం సామ్రాజ్యాన్ని నిర్మించిన యోధుడు. మొఘల్ సామ్రాజ్య(Mughal Empire) పతనాన్ని శాసించి, హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన భరతమాత వీరపుత్రుడు ఛత్రపతి శివాజీ. నేడు ఆ వీరపుత్రుడి 394వ జయంతి. యువతరానికి, తరతరాలకు పౌరుషాగ్నిని రగిలించే ఆయన జీవితం ఎంతో మందికి దిక్సూచి.
హిందూ ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన యోధుడు
భారతదేశ చరిత్ర(History of India)లో గొప్పగొప్ప వారిలో ఛత్రపతి శివాజీ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన పేరు వింటేనే హిందువు(Hindus)ల్లో ఎనలేని ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఛత్రపతి శివాజీగా ప్రఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే(Shivaji Raje Bhosle) ఫిబ్రవరి 19, 1630లో మహారాష్ట్ర(Maharastra)లోని పుణే జిల్లా జున్నార్ పట్టణంలోని శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి(Shahaji, Jijiabai) దంపతులకు జన్మించాడు. శివాజీకి ఆమె తల్లి చిన్నతనం నుంచే ఉగ్గుపాలతో పాటు పౌరుషం నేర్పింది. ‘‘నిన్ను కన్నది దేశం కోసం పోరాడటానికి, హిందూ ధర్మాన్ని కాపాడటానికి’’ అని జిజియాబాయి చిన్నతనంలోనే శివాజీకి నూరిపోసింది.

16 ఏళ్లకే కత్తి పట్టి.. మొఘలుల భరతం పట్టి
ఈ నేపథ్యంలో 16 ఏళ్లకే కత్తి పట్టి గెరిల్లా యుద్ధశిక్షణ(Guerrilla warfare) పొందాడు. ఇదే క్రమంలో శివాజీ పొరుగున ఉన్న బీజాపూర్ సుల్తానేట్‌పై తన విజయయాత్రను ప్రారంభించాడు. జనరల్ అఫ్జల్ ఖాన్ నేతృత్వంలోని 20,000 మంది సైనికుల సైన్యాన్ని ఓడించి, దక్కన్ సుల్తానేట్స్ (అప్పటి) మొఘల్ వైస్రాయ్ అయిన ఔరంగజేబు(Aurangzeb) దృష్టిని ఆకర్షించాడు. మొఘల్ సామ్రాజ్యంతో చాలా కాలం పాటు జరిగిన ఘర్షణల తరువాత, 1674లో శివాజీ మహారాజ్ అధికారికంగా రాయ్‌గఢ్లోని తన కోట నుంచి ఛత్రపతిగా పట్టాభిషేకం(Coronation as Chhatrapati) పొందాడు. దాదాపు 27 ఏళ్లపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచిన శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి 1680, ఏప్రిల్ 3న రాయఘడ్ కోటలో మరణించాడు.






