ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ‘‘టెస్లా(Tesla)’’ ఈ రోజు దేశంలోకిఅడుగుపెట్టింది. ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్(Bandra Kurla Complex)లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా కొత్త షోరూంను మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడణవీస్(Devendra Fadnavis) ప్రారంభించారు. ఈ షోరూంలో చైనా(Chaina) నుంచి దిగుమతి చేసుకున్న Model-Y క్రాస్‌ఓవర్‌లను ప్రదర్శించనున్నారు. జూలై చివరి నాటికి న్యూఢిల్లీలో రెండో షోరూం తెరవాలని టెస్లా భావిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌లో టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో లేదు. లాభాల కన్నా, బ్రాండ్ వాల్యూను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇతర దేశాల నుంచి టెస్లా కార్లను ఇండియాలోకి తీసుకువస్తోంది.
BYD నుంచి గట్టిపోటీ
టెస్లా దాని ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా(America), చైనాలో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్(India)లో తన సత్తా చాటాలని అనుకుంటోంది. కంపెనీ అమ్మకాలు గత త్రైమాసికంలో పడిపోయాయి. అమెరికన్ కంపెనీకి, చైనీస్ కంపెనీ అయిన BYD నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది.
రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఉండొచ్చు
మోడల్ Y ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు(Electric Car). అయితే, మన దేశంలో కొంత మంది మాత్రమే దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీని ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఉంటుందని అంచనా. ముఖ్యంగా, లగ్జరీ వాహన కొనుగోలుదారులకు టెస్లా ఒక మంచి ఎంపిక అవుతుంది. టెస్లా BMW, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీదారులతో పోటీపడబోతోంది. మన దేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను అందించే టాటా, మహీంద్రాలతో పోటీ ఉండే అవకాశం లేదు.

భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు
కాగా ఎలన్ మస్క్ సారథ్యంలోని టెస్లా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది. అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)తో భేటీ అయ్యారు.
📍 Tesla Lands in Mumbai!
Chief Minister Devendra Fadnavis inaugurates India’s first Tesla showroom at BKC – A proud moment for progressive Maharashtra.@Dev_Fadnavis @CMOMaharashtra @Tesla #DevendraFadnavis #PratapSarnaik#TeslaInIndia #BKCShowroom #GreenFuture… pic.twitter.com/qwD22Hl0b3— Pratap Baburao Sarnaik (@PratapSarnaik) July 15, 2025






