ఆస్ట్రేలియా(Australia) గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు యూట్యూబ్(Youtube) వాడకంపై బ్యాన్ విధించింది. 16 ఏళ్లలోపు పిల్లలు ఇకపై యూట్యూబ్ ఖాతాల(Youtube Account)ను తెరవడానికి వీలు లేదు. డిసెంబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఇప్పటికే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఎక్స్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల విషయంలో ఆస్ట్రేలియా ఇలాంటి నిబంధనల(Rules)నే అమలు చేస్తోంది. ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి కాపాడటమే. సైబర్‌బుల్లీయింగ్, అవాంఛనీయ కంటెంట్ ప్రభావాలకు గురికావడం, సోషల్ మీడియా(Social Media) ఎక్కువగా వాడటం వల్ల వచ్చే మానసిక ఆరోగ్య సమస్యల(Mental health problems) నుంచి పిల్లలను రక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పిల్లల్లో 37 శాతం మంది యూట్యూబ్‌లోనే
యూట్యూబ్ వీడియోల ప్లాట్‌ఫామ్ అయినప్పటికీ, సాధారణ SMలో ఉండే నష్టాలు ఇక్కడ కూడా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో హానికరమైన కంటెంట్‌ను చూసిన పిల్లల్లో 37 శాతం మంది యూట్యూబ్‌లోనే దాన్ని చూసినట్లు తేలింది. ప్రధాని ఆంథోనీ అల్బనీస్(PM Anthony Albanese) మాట్లాడుతూ, డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రత తమ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని చెప్పారు. సైబర్‌బుల్లీయింగ్, అసభ్యకరమైన కంటెంట్, ఆన్‌లైన్ గ్రూమింగ్, ఎక్కువ స్క్రీన్ సమయం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

10 మందిలో తొమ్మిది మంది ప్రభుత్వానికి మద్దతు
మైనర్‌లు యూట్యూబ్‌లో అకౌంట్ లేకుండా వీడియోలు చూడొచ్చు, కానీ వారికి పర్సనల్ సిఫార్సులు, వీడియోలు పెట్టడం, కామెంట్ చేయడం వంటి సదుపాయాలు ఉండవు. ఆస్ట్రేలియా ప్రజల్లో పది మందిలో తొమ్మిది మంది ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు. ప్రపంచంలోనే ఇది చాలా కఠినమైన సోషల్ మీడియా నియంత్రణలలో ఒకటి. భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా ఇలాంటి భద్రతా చర్యలను అమలు చేసే అవకాశాలూ లేకపోలేదు.
#BREAKING 🚨 The federal government has confirmed it will ban YouTube accounts for under-16s, backflipping on a previously-granted exemption after a recommendation from the eSafety Commissioner
However, there will not be restrictions stopping viewing in a logged-out state pic.twitter.com/Bqeqm7cJFi
— 6 News Australia (@6NewsAU) July 29, 2025






