చైనా(China)లో భారీ వర్షాలు(Heavy Rains), వరదలు(Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్(Beijing)లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా బీజింగ్‌లో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. దాదాపు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. వరదల కారణంగా మియున్ జిల్లా(Miun District) తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ 28 మంది, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. హెబీ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో పలువురి ఆచూకీ గల్లంతైంది.

ఇదిలా ఉండగా చైనాలోని లువాన్ పింగ్ కౌంటీ(Luan Ping County)లోని గ్రామీణ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడటం(Landslide)తో కొంతమంది ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. జనావాసాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదుల్లో వరద ఉధృతి అధికంగా ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిమయంగా మారింది. ఈ భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని చైనా ప్రధాన మంత్రి లి క్వియాంగ్(China PM Li Keqiang) తెలిపారు. కాగా చైనాలో భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతున్నాయి.
Miyun District, Beijing, China – 28 July 2025 – Qingshui River overflowed causing terrible flooding #china #floods #flooding #xwx #disasterupdate pic.twitter.com/VOzZrsCrf8
— Disaster Update (@DisasterUpdate2) July 29, 2025






