Mana Enadu : స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉలిక్కిపడే ఓ ఘటన జరిగింది. చైనాలో షాంగ్సీలో యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ పేలిన ఘటన (iPhone 14 Pro Max Blast)లో ఓ మహిళ తీవ్రంగా గాయాలపాలైంది. మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బ్యాటరీ సమస్య కారణంగానే ఈ దురదృష్టకర ఘటన జరిగినట్లు అంతా భావిస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
మహిళ నిద్రపోయే ముందు ఐఫోన్(iPhone Explosion)ను ఛార్జ్ చేసి ఉంచగా.. రాత్రి నిద్రిస్తున్న సమయంలో అనుకోకుండా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌పై చేయడంతో ఐఫోన్‌లో మంటలు చెలరేగి పేలిపోయింది. వెంటనే నిద్ర లేచి పొగ, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా.. అప్పటికే ఫోన్ పూర్తిగా కాలిపోయింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. బ్యాటరీలో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మహిళ నివసించే అద్దె ఇల్లు డ్యామేజ్ అవ్వడంతో పరిహారం చెల్లించాలని యజమాని కోరుతున్నారు.
మొబైల్ ఫోన్లు ఎక్కువ సేపు ఛార్జ్ చేయొద్దు
ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల(Smart Phones)ను ఎక్కువ సేపు ఛార్జింగ్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే కంపెనీ అందించిన ఛార్జర్, బ్యాటరీ యూనిట్‌ను మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. ఇక ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్ పేలడం వంటి ఘటనలు చాలా జరిగాయి.