మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులను అనిల్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చిరు-అనిల్ సినిమా పూజా కార్యక్రమం ఉగాది పర్వదినాన జరగనుందని తెలిసింది. ఈ వార్త తెలిసి చిరు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఉగాది రోజున చిరు సినిమా పూజ
ఇక అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. అనిల్ చిత్రాల్లో కామెడీ ప్రధానంగా ఉంటుంది. ఇక చిరు కామిక్ టైమింగ్ గురించి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే ఏ రేంజు ఫన్ ఉంటుందో ఊహించగలం. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగాస్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరు నుంచి చాలా కాలంగా సీరియస్ సబ్జెక్టులే వస్తున్నాయి. అయితే ఈసారి అనిల్ మెగాస్టార్ తో కామెడీ చేయించడం కాస్త డిఫరెంట్ గా ఫ్రెష్ గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
జూన్ నుంచి షూటింగ్
ఇక ఉగాది రోజున పూజా (Chiru Anil Movie) కార్యక్రమం జరుపుకోనున్న ఈ సినిమా షూటింగు జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 2026 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిసింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. చిరంజీవి సెట్ లో అడుగుపెట్టే సమయానికి అన్ని పనులు చకచకా కంప్లీ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట అనిల్. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.






