తన అభిమానులన్నా.. తోటి నటీనటులన్నా, తనతో సినిమాలు తీసే దర్శకులన్నా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఎంతో ఇష్టం. ఎవరైనా యువ దర్శకుడు మంచి సినిమా తీస్తే వారిని స్వయంగా పిలిచి.. లేదా ఫోన్‌లో అభినందిస్తుంటారు. అయితే తన అభిమానుల్లో ఒకడిగా, తనకు భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ బాబీ(Bobby kolli)కి చిరంజీవి నుంచి అపురూప కానుక లభించింది. ఓ ఖరీదైన వాచ్ను స్వయంగా చిరంజీవే బాబీకి అందించాడు. మెగాస్టార్ నుంచి అపురూప కానుకను అందుకున్న దర్శకుడు బాబీ ఆనందంతో ఉప్పొంగిపోయారు. అనూహ్య కానుకకు భావోద్వేగానికి గురయ్యారు. బాబీకి చిరంజీవి వాచ్ తొడుగుతున్న ఫొటోలు.. ఆ వాచ్ను చూపిస్తూ బాబీ ఆనందం వ్యక్తం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
చిరంజీవి కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్
చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో 2023 జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య (valtheru veerayya) భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ సినిమా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది. దీంతో మళ్లీ మెగాస్టార్, బాబీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
చిరంజీవితో మరో సినిమా..
చిరంజీవితో మరో భారీ సినిమాకు బాబీ రెడీ అయినట్లు తెలుస్తోంది. విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేస్తున్నట్లు బాబీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవితో మరో సినిమా చేస్తున్నానని, తాను చెప్పిన కథ మెగాస్టార్‌కు బాగా నచ్చిందని ఆయన తెలిపారు. ఆ ప్రాజెక్టుకు స్క్రిప్టు, ఇతర పనులు పూర్తయినట్లు చె
ప్పారు.






