మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ముస్సోరి( Mussoorie) లోకేషన్లో మరో షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్ పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తుండగా, చిరంజీవి ఎంతో స్టైలిష్‌గా వెనకనుండి థంబ్ చూపుతూ వారిని పలకరించటం.. ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. చిరంజీవి తన లోని అసలైన మ్యాజిక్‌ను మరోసారి స్క్రీన్‌పై చూపించబోతున్నారని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోకు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ ముస్సోరిలో పది రోజుల పాటు జరుగనుంది.
Mountains. Magic. Megastar. ❤️🔥❤️🔥❤️🔥
The second schedule of #Mega157 begins in Mussoorie where some crucial and entertaining scenes featuring Megastar @KChiruTweets, #Nayanthara and other main cast will be shot 😍#ChiruAnil SANKRANTHI 2026 – రఫ్ఫాడించేద్దాం 🔥 @anilravipudi… pic.twitter.com/N2NOCPABPd
— Shine Screens (@Shine_Screens) June 11, 2025
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించి ప్రోమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తూ అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేస్తున్నారు. ఇదే చిరంజీవి సినిమాలకు అవసరమైన హైప్ అని అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం, చిరంజీవి సినీ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ కావచ్చని అంచనాలు పెరుగుతున్నాయి.






