భారత్(India)తో జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా మారనుంది. తీవ్రమైన భుజం గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్(Chirs Woaks), జట్టు అవసరమైతే ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని సీనియర్ బ్యాటర్ జో రూట్(Joe Root) ప్రకటించాడు. రూట్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓవల్(Oval) మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విజయానికి కేవలం 35 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉండటంతో మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చివరి సెషన్‌లో వికెట్లు పడగొట్టడంతో టీమిండియా తిరిగి రేసులోకి వచ్చింది. సిరీస్‌ను సమం చేయాలంటే భారత్‌కు మరో మూడు వికెట్లు అవసరం.
జట్టు గెలుపు కోసం కట్టుబడి ఉన్నాడు..
కాగా ఈ టెస్టు తొలి రోజే ఫీల్డింగ్ చేస్తూ క్రిస్ వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది(Severely injured shoulder). గాయం కారణంగా అతడు చేతికి స్లింగ్ తగిలించుకుని కనిపించాడు. దీంతో అతను ఈ మ్యాచ్‌కు పూర్తిగా దూరమైనట్లేనని అందరూ భావించారు. అయితే, జో రూట్ మాట్లాడుతూ, “అందరిలాగే వోక్స్ కూడా జట్టు గెలుపు కోసం కట్టుబడి ఉన్నాడు. అతను ఇప్పటికే నెట్స్‌లో కొన్ని త్రోడౌన్లు కూడా చేశాడు. అవసరమైతే, తన శరీరాన్ని పణంగా పెట్టి బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు” అని వివరించాడు.
చివరి వికెట్‌గా బరిలోకి దిగే అవకాశాలు
వోక్స్ గాయం తీవ్రత దృష్ట్యా ఈ మ్యాచ్‌లో ఇక ఆడలేడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(England and Wales Cricket Board) మొదట ప్రకటించినప్పటికీ, నిబంధనల ప్రకారం గాయపడిన ఆటగాడు బ్యాటింగ్ చేయకూడదన్న రూల్ ఏదీ లేదని స్పష్టత ఇచ్చింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నప్పటికీ వోక్స్ చివరి వికెట్‌గా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే, అది ఇంగ్లండ్ సిరీస్ ఫలితాన్ని నిర్దేశించే సాహసోపేతమైన ఇన్నింగ్స్‌గా నిలిచిపోవచ్చు.
Joe Root in Press Conference :
🗣️ Chris Woakes in a huge amount of pain. We have seen this series – Pant batting with a broken foot, Woakes is ready to put body on the line for England#INDvsENG #AskStar pic.twitter.com/yoPCpylzPS
— INDIAN (@indian_Cricket4) August 3, 2025






