Chiyaan Vikram: క్రేజీ న్యూస్.. మహేశ్‌బాబు మూవీలో చియాన్ విక్రమ్!

టాలీవుడ్‌లో శివపుత్రుడు, అపరిచితుడు(Aparichitudu), మల్లన్న(Mallanna), నాన్న, ఐ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న తమిళ్ స్టార్ హీరో విక్రమ్‌(Vikram).. ఇటీవల బాక్సాఫీస్(Box office) వద్ద వరుస పరాజయాలు చవిచూస్తున్నారు. ఈ మధ్య వచ్చిన తంగలాన్ భారీ డిజాస్టర్‌ను అందుకోగా ఆ తర్వాత వచ్చిన ‘వీర ధీర శూరన్’ సైతం అభిమానులను ఊహించిన రేంజ్‌లో అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో చియాన్ విక్రమ్‌కు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్‌(Tollywood)లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే..

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు

బాహుబలి ఫ్రాంచైజీ, RRR చిత్రాల తర్వాత ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల జాబితాలో చేరారు రాజమౌళి(Director Rajamouli). ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబు(Maheshbabu) హీరోగా తెరకెక్కిస్తున్న ‘SSMB29’పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఈ పాన్‌ ఇండియా మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టులో చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) కూడా భాగం కానున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్టోరీని కూడా విక్రమ్‌కి డైరెక్టర్ రాజమౌళి వినిపించారట.

Chiyaan Vikram In Mahesh Babu's SSMB29: Thangalaan Actor Says 'SS Rajamouli  And I Will Definitely... | Republic World

అమేజాన్‌ అడవుల నేపథ్యంలో..

ఆయన కూడా రాజమౌళీ సినిమాలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తున్నది. అమేజాన్‌ అడవుల నేపథ్యంలో నిధి అన్వేషణే ప్రధానాంశంగా రూపొందనున్న ఈ సినిమాలో విక్రమ్‌ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నదని సమాచారం. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్(Release) చేసే అవకాశం ఉంది. ఇందులో నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.1000కోట్ల వ్యయంతో డా. KL నారాయణ నిర్మిస్తున్నారు. కీరవాణి(Kiravani) మ్యూజిక్ అందిస్తున్నారు.

SSMB 29 | New South Indian Hindi Dubbed Full Movie 2024 | Mahesh Babu | New  Blockbuster Action Movie

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *