Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun వివాదం హాట్ టాపిక్. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట (Sandhya Theater Stampede) తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్.. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ సంచలనంగా మారింది. బెయిల్ మీద ఉన్న బన్నీ పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం అరెస్టయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బన్నీ వివాదంపై స్పందించాలని జానీ మాస్టర్‌ను (Jani Master) మీడియా కోరింది. దీంతో ఆయన నేనే ఒక ముద్దాయిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ‘ఈ విషయంలో నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. నేనే ఒక ముద్దాయిని. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. న్యాయస్థానంపై, నాకు నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలి’ అని అన్నారు.
జైలుకు వెళ్లకముందు.. వెళ్లొచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది? అని అడగ్గా.. ఒకేలా ఉందని మాస్టర్ సమాధానమిచ్చారు. ‘గుండెల మీద చెయ్యి వేసి మరీ చెబుతున్నా పరిశ్రమలో నా గుర్తింపు, గౌరవం ఎప్పటిలాగే ఉంది’ అని పేర్కొన్నారు.






