జానీ మాస్టర్ Vs ఝాన్సీ.. నెట్టింట ట్వీట్ వార్

డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master), ఫిల్మ్ ఇండస్ట్రీ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ మెంబర్, నటి, యాంకర్ ఝాన్సీ (Jhansi) మధ్య సోషల్ మీడియాలో ట్వీట్ వార్ నడుస్తోంది. జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ కేసు గెలిచిందని ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఛాంబర్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేసిన జానీ మాస్టర్ మధ్యంతర పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందని.. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉందని ఆ తీర్పు మరోసారి రుజువు చేసిందని ఝాన్సీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

జానీ మాస్టర్ పై మాదే గెలుపు- ఝాన్సీ పోస్ట్ వైరల్

వాళ్లను చూస్తే జాలేస్తోంది

ఈ నేపథ్యంలో దీనిపై జానీ మాస్టర్ (Jani Master Tweet Today) స్పందించారు. సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపైన కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుందని అన్నారు. తనకు తెలియకుండా జరిగిన యూనియన్‌ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని వారికి అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.

న్యాయం గెలుస్తుంది.. నిజం తెలుస్తుంది

“మీరేం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారేమో .. తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజ స్వరూపమేంటో అందరికీ తెలుస్తుంది. దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనో అందరూ తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. న్యాయమే గెలుస్తుంది. నిజం అందరికీ తెలుస్తుంది’’ అంటూ జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

లైంగిక్ వేధింపుల కేసులో అరెస్టు

లైంగిక వేధింపుల ఆరోపణల (Jani Master Arrest News)తో గతేడాది జానీ మాస్టర్‌ అరెస్టు కాగా.. డ్యాన్స్‌ యూనియన్‌ నుంచి ఆయణ్ను తొలగించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిపైనా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నిర్దరణ కాని ఆరోపణలను కారణంగా చూపిస్తూ తనను శాశ్వతంగా యూనియన్ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన తెలిపారు. తన పదవీకాలం ఇంకా ఉందని.. అయితే అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *