గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జాబితాలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ కుమార్, నటి శోభనలు పద్మభూషణ్ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రతిష్ఠాత్మక పురస్కారం పొందిన వీరికి సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
బాల బాబాయ్‌కి కంగ్రాట్స్
‘ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు పొందిన బాల బాబాయ్‌కి అభినందనలు. మీరు సినిమా రంగానికి చేసిన అసమానమైన కృషి, అవిశ్రాంత ప్రజా సేవకు నిదర్శనమే ఈ గుర్తింపు’ అని ఎన్టీఆర్ ట్వీట్ షేర్ చేశారు. మరోవైపు నటుడు కల్యాణ్ రామ్ కూడా బాలయ్యకు శుభాకాంక్షలు చెప్పారు. ‘పద్మభూషణ్ అవార్డు అందుకున్న మా బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు. మీరు సమాజానికి చేసిన కృషికి ఇది నిజమైన గుర్తింపు బాబాయ్’ అని ట్వీటారు.
పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి హృదయపూర్వక అభినందనలు!
🔸అయిదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ గారు – హిందూపురం…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 25, 2025
సంతోషంగా ఉంది
‘‘ఐదు దశాబ్దాలకుపైగా తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ (Balakrishna) పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆయన హిందూపురం శాసన సభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఎన్నో సేవలందించారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. పద్మ పురస్కారాలకు ఎంపికైన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాలయ్యకు అభినందనలు తెలియజేశారు.
A heartfelt congratulations to Balakrishna garu on being honored with the Padma Bhushan! 👏🏻👏🏻👏🏻 This well-deserved recognition celebrates his unwavering passion and dedication to cinema and art. Truly an inspiration!
— Mahesh Babu (@urstrulyMahesh) January 25, 2025
మెగాస్టార్, సూపర్ స్టార్ విషెస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. ఈ అవార్డును అందుకోవడానికి మీరు పూర్తి అర్హులు’’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పద్మ అవార్డులు పొందిన తెలుగు వారికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Heartiest Congratulations on the conferment of prestigious Padma Vibhushan to Dr.D Nageswara Reddy garu for his illustrious services and Padma Bhushan award to dear friends #NandamuriBalakrishna, #AjithKumar, Sri Anant Nag , Sekhar Kapur Ji ,
my co star in Rudraveena #Sobhana…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2025






