మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. మెహన్ బాబు నివాసం జల్ పల్లి లోని అడవిలో వేట కొనసాగించారు విష్ణు సిబ్బంది. జల్ పల్లిలోని చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువచ్చాడు మంచు విష్ణు మేనేజర్ కిరణ్. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లాడు ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్. గతంలోను వీరు ఇలాగె చేసే వారని ఇద్దరి చర్యలను తప్పుపడుతూ పలుమార్లు అభ్యంతరం చెప్పిన మంచు మనోజ్. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని మనోజ్ హెచ్చరించిన పట్టించుకోని మేనేజర్, ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా పాటలు పాడుకుంటూ అడవి పందులను తీసుకువెళ్తున్నారు మంచు విష్ణు అనుచరులు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్.
వన్యప్రాణులు..జంతు సంరక్ష కార్యకర్తలు దీనిపై మండిపడుతున్నారు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విష్ణు సిబ్బంది చర్య వన్యప్రాణుల చట్ట ఉల్లంఘనే అని ఆరోపిస్తున్నారు. తక్షణమే దీనిపై సంబంధిత శాఖలు విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంచు విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషియన్ దేవేంద్రప్రసాద్ పై ఇప్పటికే ఈ తరహా ఆరోపణలు గతంలోనూ ఉన్నాయని, మంచు మనోజ్ హెచ్చరించినా వారిద్దరు వినకుండా అడవి పందులను వేటాడినట్లుగా మనోజ్ వెల్లడించినట్లుగా సమాచారం.






