తెలంగాణ(Telangana)లో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) విజయోత్సవాలకు సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ వరంగల్(Warangal)లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సభ నిర్వహించనుంది. ఈ సభకు ఇందిరా గాంధీ జయంతి కావడంతో ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం(Indira Mahila Shakti Pranganam’గా పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) హాజరుకానున్నారు. కాగా ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు లక్షమంది వరకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో దాదాపు 50 వేల మందికిపైనే మహిళలు హాజరయ్యేలా సభ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు సభా ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు.
కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్న సీఎం
ఈ సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలో దాదాపు రూ.95 కోట్లతో 4.25 ఎకరాల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని(Kaloji art field) సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. దీంతోపాటు ఇందరా గాంధీ జయంతి సందర్భంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల(For Women Empowerment Buildings)కు సీఎం ఇక్కడే శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. ఇక ఈనెల 20వ తేదీ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ(Vemulawada) రాజన్న దర్శనానికి వెళ్లనున్నారు. రాజన్న దర్శనం అనంతరం భారీ బహిరంగ సభలో CM పాల్గొంటారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన ఆధునిక సదుపాయాలు అందించడమే కాకుండా, పట్టణం సమగ్ర అభివృద్ధి కోసం కూడా వినియోగించనున్నారు.
వేములవాడ రాజన్న ఆలయాభివృద్ధికి నిధులు
ఇందులో వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం(Sri Rajarajeswara Temple) అభివృద్ధికి రూ. 76 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఉపయోగపడతాయి. అలాగే, వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లను వెడల్పు చేసేందుకు రూ.47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు నూతన డ్రైనేజీ నిర్మాణానికి రూ. 3.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి.






