Mana Enadu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం జులై 18న రైతు రుణమాఫీ (Farmer Loan Waiver Sche,e) పథకాన్ని ప్రారంభించింది. మొత్తం మూడు విడతల్లో చేపట్టిన ఈ ప్రక్రియలో మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ చేసింది. జులై 30న రెండో విడతలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రుణమాఫీ జరిగింది. మూడో విడతలో ఆగస్టు 15న రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసింది.
రుణమాఫీ జరగని వారు ఇలా చేయాలి
అయితే అన్నీ అర్హతలు ఉన్నా కొందరు రైతులకు రుణమాఫీ (Rythu Runa Mafi) జరగలేదు. ఇక చాలా మంది రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారు ఉన్నారు. పై పైకం వారు బ్యాంకులకు చెల్లిస్తే రూ.2 లక్షల రుణం (Rs.2 Lakh Loan Waiver) తాము మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రెండూ ఇప్పటివరకు జరగకపోవడంతో ఇటు రైతులతో పాటు అటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రుణమాఫీ కానివారికి.. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నవారికి సీఎం రేవంత్రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. అవేంటంటే..?
రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉందా
హైదరాబాద్ లో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రుణమాఫీకి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రూ.2 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ జరగలేదన్న సీఎం.. అలాంటి వారందరూ రూ.2 లక్షల కంటే పైన ఉన్న అమౌంట్ బ్యాంకులలో చెల్లించాలని సూచించారు. ఆ తర్వాత వెంటనే వారికి కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
కలెక్టరేట్ లో మీ సమస్యకు పరిష్కారం
“అన్ని అర్హతలు ఉండి కూడా రూ.2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ (Crop Loan Waiver in Telangana) జరగని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతుల సమస్యల కోసం ప్రతి కలెక్టరేట్లో ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశాం. రుణమాఫీ కానివారు కలెక్టరేట్ వెళ్లి సంబంధిత సమస్య గురించి ఫిర్యాదు చేయండి. అధికారులు మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. తగిన అర్హతలు ఉంటే మీ క్రాప్ లోన్ తప్పకుండా మాఫీ అవుతుంది.” అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.