అల్లు అర్జున్ అరెస్టు.. రేవంత్, కేటీఆర్ రియాక్షన్ ఇదే

Mana Enadu : హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బన్నీ అరెస్టుపై స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. దిల్లీలో ఉన్న ఆయన.. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతుండగా.. ఓ మీడియా ప్రతినిధి బన్నీ అరెస్టుపై ప్రశ్నించారు.

చట్టం తనపని తాను చేసుకుపోతుంది

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు. చట్టం ముందు అంతా సమానమేనని .. ఇందులో తన జోక్యం ఏమి ఉండదని స్పష్టం చేశారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది కాబట్టి పోలీసు చర్యల్లో భాగంగా ఆయణ్ను అరెస్టు చేశారని.. అంతా చట్టపరంగానే జరుగుతుందని సీఎం రేవంత్ అన్నారు.

పాలకుల అభద్రతకు ఇది పరాకాష్ట

మరోవైపు అల్లు అర్జున్ పై కేటీఆర్ స్పందిస్తూ.. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉందని.. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారని ప్రశఅనించారు.  అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్తుడిగా భావించి ఇలా చేయొద్దని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. హైడ్రా వల్ల చనిపోయిన వారి కేసులో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

ఇది సర్కార్ వైఫల్యేమే

మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తూ.. జాతీయ అవార్డు పొందిన నటుడిని దుస్తులు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా బెడ్ రూమ్ నుంచి అరెస్ట్ చేసి అగౌరవ పరిచారని మండిపడ్డారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని.. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. పెద్ద ఈవెంట్లకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. 


Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *