
కన్నడ ప్రేక్షకులను భయపెట్టి, నవ్వించిన హారర్ కామెడీ మూవీ ‘సు ఫ్రమ్ సో’ (Su From So). ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. షనీల్ గౌతమ్ (Shaneel Gautham), సంధ్య, రాజ్ బి.శెట్టి తదితరులు నటించిన ఈ మధ్యే కన్నడలో విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. కేవలం రూ.4 కోట్లతో చిన్న సినిమాగా రూపొంది ఘనవిజయం సాధించింది. ఏకంగా రూ.36 కోట్లకుపైగా వసూలు చేసిందే. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను సైతం అలరించేందుకు సిద్ధమైంది. అదే టైటిల్‌తో ఈ నెల 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను (Su From So Telugu Trailer)తాజాగా రిలీజ్ చేశారు. నవ్విస్తూ భయపెట్టిన ట్రైలర్ ను మీరూ చూసేయండి.