ఎయిరిండియా(Air India)కు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్(Ahmadabad)లో కుప్పకూలి 260 మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్(Medical College Hostel)పై కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండే అవకాశాలున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది. ఈ ఉదంతంలో కుట్ర కోణంపై కూడా దృష్టి సారించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ(Ministry of Civil Aviation) సహాయ మంత్రి మురళీధర్ మోహోల్(Muralidhar Mohol) వెల్లడించారు.
అన్ని కోణాల్లోనూ విచారణ
ఈ కేసు దర్యాప్తును ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) చేపట్టిందని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. పుణె(Pune)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విమానం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్‌బాక్స్(Black Box)ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపుతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను మంత్రి మురళీధర్ పూర్తిగా ఖండించారు.
పలు ఏజెన్సీలు సమన్వయంతో..
“బ్లాక్‌బాక్స్ మన దేశంలోనే, దర్యాప్తు సంస్థల వద్దే సురక్షితంగా ఉంది. దానిని ఎక్కడికీ పంపే ప్రసక్తే లేదు” అని ఆయన తేల్చిచెప్పారు. ఇది చాలా విషాదకరమైన ఘటన అని, ఏఏఐబీ దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు(Enquiry) ప్రారంభించిందని తెలిపారు. CCTV ఫుటేజీని విశ్లేషించడంతో పాటు పలు ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. 2 ఇంజిన్లు ఒకేసారి విఫలం కావడం అనేది అత్యంత అరుదైన విషయమని మంత్రి పేర్కొన్నారు.
Union Minister Muralidhar Mohol says Aviation Ministry is probing sabotage angle also in Ahmedabad Air Crash.
Source: NDTV
— IndiaTracking (@IndiaTracking) June 29, 2025








