
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలోని రేపల్లె గ్రామంలో 1990ల నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం(Constable Kanakam)’. ఈ నెల 14 నుంచి ఈటీవీ విన్(Etv Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) ప్రధాన పాత్రలో నటించిన ఈ ఆరు ఎపిసోడ్‌ల సిరీస్‌ను ప్రశాంత్ కుమార్ దిమ్మల(Prashanth Kumar Dimmala) రూపొందించారు. రాజీవ్ కనకాల, మేఘ లేఖ, అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas), రమణ భార్గవ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. కథ, స్క్రీన్‌ప్లే, నేపథ్య సంగీతం సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సిరీస్ ప్రస్తుతం ట్రెండిండ్‌లో ఉంది.
యువతులు మాయమవుతుండటంతో
కథలో కనక మహాలక్ష్మి (Varsha Bollamma) రేపల్లె పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేరుతుంది. గ్రామంలోని అడవి గుట్టలోకి వెళ్లిన యువతులు మాయమవుతుండటంతో భయానక వాతావరణం నెలకొంటుంది. కనకం స్నేహితురాలు చంద్రిక (Megha Lekha)) కూడా అదృశ్యమవడంతో కనకం ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో పడుతుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లు, వెలుగులోకి వచ్చే షాకింగ్ నిజాలు కథను ఉత్కంఠగా నడిపిస్తాయి. వర్ష బొల్లమ్మ సహజ నటన, భయం నుంచి ధైర్యంగా మారే ఆమె పాత్ర పరివర్తన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది..
ఇక రాజీవ్ కనకాల(Rajiv Kanakala), రమణ భార్గవ్ తమ పాత్రల్లో లీనమై నటించారు. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలకు గాఢతను జోడిస్తుంది. శ్రీరామ్ ముక్కపాటి సినిమాటోగ్రఫీ, విష్ణువర్ధన్ పుల్లా ప్రొడక్షన్ డిజైన్ సిరీస్‌కు బలం. అయితే, మొదటి మూడు ఎపిసోడ్‌లలో కథనం నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రలు అనవసరంగా అనిపించడం సిరీస్‌కు స్వల్ప లోపం. చివరి రెండు ఎపిసోడ్‌లలో వచ్చే ట్విస్ట్‌లు, విలన్ పాత్ర చిత్రణ ఆకట్టుకుంటాయి. సెకండ్ సీజన్‌కు లీడ్ ఇస్తూ కథను ముగించడం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ సిరీస్ కుటుంబంతో చూడదగిన థ్రిల్లర్‌గానూ ఉంది.
The trailer of Constable Kanakam is out! Launched grandly by Megastar Chiranjeevi garu!!
A storm is coming… stay tuned!#ConstableKanakam 🚔
Streaming AUG 14 only on @etvwin🔥 A Win Original Series
👉 Only on @etvwin
ORIGINALLY MADE
First Episode Free @VarshaBollamma… pic.twitter.com/wGV3Dpa8YY— ETV Win (@etvwin) August 8, 2025